ఘనంగా జరిగిన బాలక్రిష్ణ పద్మభూషణం & మహానాడు 2025 వేడుకలు! ప్రపంచవ్యాప్తంగా బహ్రెయిన్ తోనే ప్రారంభం!
Wed May 14, 2025 19:45 Politics
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు బహరైన్ లొ NRI తెలుగు దేశం మరియు NBK సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 500 పైగా అభిమానుల సమక్షంలో అధారి పార్కులో అత్యద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు గారి తనయులు శ్రీ నందమూరి రామకృష్ణ గారు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ గారు, ప్రముఖ సినీ నటి కళారత్న ప్రభ రమేష్ గారు, నందమూరి బెనర్జీ గారు, నందమూరి బిజిలి గారు, స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్ గారు, ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్ గారు, తెలుగు యువత రాష్ట్ర అదికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు, ప్రముఖ గాయకులు రాము & నాద ప్రియ గారు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
బహరైన్ తెలుగు దేశం కార్య వర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థలు, తెలుగు ఎకో వారియర్స్, సహయ సహకారాలతో ఈ వేడుకల నిర్వాహణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ - మన అన్నగారి శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రతి దేశంలో జరుపుకుంటున్నాం. జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కథా నాయకుడు, మహా నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు అని కీర్తించారు. రాజకీయ, సినీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు అన్నగారు. మనకు రాముడు, కృష్ణుడు తెలుసు, అలాగే రావణ శకం తెలుసు, శాలివాహన రాజులు తెలుసు. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది, గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్ నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించేవారు అనేకన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్. రాజకీయాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: టీడీపీ మహానాడు షెడ్యూల్ ఖరారు! లోకేశ్ నేతృత్వంలో బహిరంగ సభకు గ్రాండ్ ప్లాన్!
నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ - ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన బహ్రెయిన్ తెలుగు దేశం సభ్యులకు కృతజ్ఞతలు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు. ఆ క్యారెక్టర్స్ ను అర్థం చేసుకునేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారు. కుటుంబంలో శుభకార్యాల కంటే ప్రజల క్షేమమే ముఖ్యం అని ఎప్పుడు చేప్పేవారని తెలియ చేశారు. తన అన్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అని కళా రంగంలోనే కాకుండా సేవా రంగం, రాజకీయ, వైద్య రంగాల్లో కూడా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలియ చేశారు. ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ - ఎన్టీఆర్ హీరోయిన్ ను అయినంత మాత్రాన నాపై ఇంత ప్రేమ, గౌరవం చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ కృతజ్ఞతలు. టి.డి.జనార్ధన్ గారు నన్ను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి పిలిచారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఎన్టీఆర్ గారి జీవితంలోని ఎన్నో విశేషాలతో తారకరామం అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల్లో మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా.. ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు.
ఇది కూడా చదవండి: నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. ప్రతి రోజు నేర్చుకుంటున్నా! టెక్ ఏఐ వేదికపై సీఎం సందేశం!
ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పురంధేశ్వరి గారు ఢిల్లీ రాజకీయాల్లో గొప్ప స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం. స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు గారి నాయకత్వంలో ఎటువంటి మచ్చ లేని, నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో 65 వారాల గా స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో ప్రతి శుక్రవారం బీచ్ లలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్ గారు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల తో పని చేసే నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో యువత ఉపాధి పెరుగుతుంది అని కొనియాడారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కు శ్రీ పొట్టి శ్రీరాములు గారు కారణం ఐతే తెలుగు వారి ఉనికిని చాటి చెప్పిన నాయకుడు శ్రీ రామారావు గారని చెప్పారు. తెలుగు యువత రాష్ట్ర అదికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా, యువత కి ఉపాధి దొరకాలన్నా తెలుగుదేశం నిరంతరం అధికారం లో ఉండాలని, మరోసారి అధికారం లోకి రావడానికి మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు. NRI తెలుగు దేశం గల్ఫ్ అధ్యక్షులు రావి రాదాక్రిష్ణ గారు మాట్లాడుతూ గత ఎన్నికల విజయం లో NRI ల పాత్ర అభినందనీయం అని ఎన్నికల కోసం సొంత డబ్బులతో ఆంధ్ర వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు.
NRI తెలుగు దేశం గల్ఫ్ కమిటీ సభ్యులు కోడూరి వెంకట్ గారు మాట్లాడుతూ తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నిలిపిన అన్న NTR గారికి వెంటనే భారత రత్న ఇవ్వాలని కోరారు. అధికారం కోసం కష్టపడ్డ NRI లకు కూడా పార్టీ లోను, ప్రభుత్వం లోను సముచిత స్థానం ఇస్తే పూర్తి సేవాభావం తో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన NRI TDP బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాథ్ బాబు గారు, హరిబాబు తక్కెల్లపాటి గారు,RSS మురళి కృష్ణ, కొత్తపల్లి రాజ శేఖర్, DV శివ కుమార్, రామ్ మోహన్ కొత్తపల్లి, అనిల్ ఆరె, సతీష్ శెట్టి, ఉన్నగిరి పూర్ణ, అంబటి నాగార్జున బాబు, ఇంతియాజ్, సతీష్ బోల్ల, AV రావు, PJ నాయుడు, చంద్ర బాబు, అనిల్ పమిడి, నోముల మురళి, మురళి క్రిష్ణ, యుగందర్, గణపర్తి అశోక్, ప్రవీణ్ చావా, మహేష్ మీరా, స్వాతి, స్రవంతి, ఉషారాణి, వంశీ, సందీప్, హరిప్రియ, శ్రీకాంత్, శ్రీ వాణి, కోటేశ్వరరావు వింతల, విరించి రియల్ ఎస్టేట్ మరియు అమరావతి అవెంజర్స్ క్రికెట్ టీం సభ్యులు అందరినీ ప్రతి ఒక్క అతిధి ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలు తో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమాన్ని NRI వింగ్ గ్లోబల్ నెట్వర్క్ వైస్ ఛైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షణలో anna NTR అనే youtube చానెల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కడప మేయర్ కు భారీ షాక్! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!
అదృష్టాన్ని పట్టేశాడబ్బా.. ఆ లాటరీపై 15 ఏళ్లుగా ప్రయత్నం! ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!
ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?
వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత పార్టీకి రాజీనామా!
నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!
ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!
ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!
ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #"NTR'sCineVajrotsavaCelebrations #Balakrishna'sPadmaBhushan #Mahanadu2025Celebrations #Bahrain
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.